బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
అంతర్జాతీయం

యుద్ధానికి బ్రేక్ పెట్టాలంటే 6 షరతులు.. ఇరాన్ కఠిన వైఖరి

యుద్ధానికి బ్రేక్ పెట్టాలంటే 6 షరతులు.. ఇరాన్ కఠిన వైఖరి

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. తక్షణ కాల్పుల విరమణకు అవకాశాలు కనిపించని పరిస్థితిలో, యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ ఆరు కీలక షరతులను ముందుకు తెచ్చింది. ఇరాన్ సీనియర్ రాజకీయ-భద్రతా వర్గాలు వెల్లడించిన ప్రకారం, ఈ షరతులు కేవలం కాల్పుల విరమణకే పరిమితం కాకుండా, మొత్తం ప్రాంతీయ శక్తి సమీకరణాన్ని మార్చేలా ఉన్నాయి. షరతులు అంగీకరించకపోతే ప్రతీకార దాడులు కొనసాగుతాయని ఇరాన్ హెచ్చరించింది.అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధి విషయంలో అల్టిమేటం ఇవ్వగా, దానికి ప్రతిగా ఇరాన్ కఠినంగా స్పందించింది. జలసంధిని దిగ్బంధిస్తామని, అవసరమైతే గల్ఫ్ దేశాలపై దాడులు కూడా చేస్తామని హెచ్చరించింది.


ఇరాన్ పెట్టిన 6 కీలక షరతులు:

  • యుద్ధం మళ్లీ జరగదని గట్టి హామీతో ఒప్పందం కావాలి
  • పశ్చిమ ఆసియాలోని అమెరికా సైనిక స్థావరాల తొలగింపు
  • యుద్ధ నష్టాలకు పూర్తి పరిహారం చెల్లింపు
  • ప్రాంతీయ యుద్ధాలన్నింటికీ ముగింపు
  • హోర్ముజ్ జలసంధిపై కొత్త చట్టపరమైన నియంత్రణ
  • ఇరాన్ వ్యతిరేక మీడియా ప్రచారాలపై చర్యలు

ఇటీవలి దాడుల్లో డిమోనా, అరద్ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని సమాచారం. ఇరాన్ ఇప్పుడు విచ్చలవిడిగా దాడులు చేయకుండా, వ్యూహాత్మకంగా కీలక లక్ష్యాలపై దాడులు చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణ యుద్ధ విరమణ సాధ్యపడదని నిపుణులు భావిస్తున్నారు. “తమపై జరిగిన దాడులకు పూర్తిగా ప్రతీకారం తీర్చుకునే వరకు ఆగమని” ఇరాన్ స్పష్టం చేస్తోంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ