Breaking News

దేవాలయాల భూములను కాపాడండి : కళ్ళం సంజీవరెడ్డి

మంగళగిరి మార్చి 23 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఉండవల్లి గ్రామంలో వేంచేసియున్నశ్రీవేణుగోపాలస్వామి, శ్రీ భాస్కర స్వామి ,శ్రీ భీమ లింగేశ్వర స్వామి వారి దేవాలయాల 24 ఎకరాల 48 సెంట్లు భూమి ఉందని ఆ భూముల పరిరక్షణ వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు అర్చకుల విషయంలో సీఆర్డీఏ అధికారులతో పాటు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు మాజీ ఎంపిటిసి సభ్యులు, దేవాలయ పరిరక్షణ కమిటీ సభ్యులు కళ్ళం సంజీవరెడ్డి అన్నారు.సోమవారం ఉండవల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మూడు దేవాలయాలకు సంబంధించి 24 ఎకరాల 48 సెంట్లు భూమిని అభివృద్ధి చేయటం ద్వారా దేవాలయాల అభివృద్ధి తోపాటు వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

థాంక్యూ లోకేష్ సార్….!

కోట్ల రూపాయల విలువచేసే ఈ భూమిని సీఆర్డీఏ స్వాధీనం చేసుకుని నేటికి పది సంవత్సరాలు పూర్తయిందని నాలుగు కిలోమీటర్ల దూరంలో విలువ లేని భూములను దేవాలయాలకు కేటాయించడాన్ని కమిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఎండోమెంట్ ఈ దేవాలయాలను ఇప్పటివరకు గ్రామ ప్రజల సహకారంతో దేవాలయాలను అభివృద్ధి చేసుకుంటూ వచ్చామని వచ్చే 20 లక్షల ఆదాయాన్ని పూర్వికులు ఎండోమెంట్ వారికి అందించడం జరిగిందని భూమిని ఎండోమెంట్ స్వాధీనంలోనే ఉంచి అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని కమర్షియల్ ప్లాట్లుగా చేసి షాపులను ఏర్పాటు చేయాలని కోరారు. సిఆర్డిఏ పరిధిలో 500 ఎకరాల భూమి లేకుండానే కొంతమంది అక్రమార్కులు పత్రాలు సృష్టించి సి ఆర్ డి ఏ వారి వద్ద ప్లాట్ లు తీసుకోని 2000 కోట్లు రూపాయలకు అమ్ముకున్నారు. ఈ అక్రమార్కులు ఇచ్చిన భూమి కృష్ణనదిలో ఉందని అన్నారు.డొంకలు,చెరువులు భూములు 300 ఎకరాల దొంగ పేపర్లు సృష్టించి సి ఆర్ డి ఏ వద్ద ప్లాట్ తీసుకుని అమ్ముకున్నారు.సిఆర్డిఏ ఏర్పాటు చేసిన తర్వాత పేదల భూములను ఈ 36 గ్రామాల్లో కొంత మంది అక్రమార్కులు 10 మూటాలుగా ఏర్పడి ఇష్టానుసారంగా భూములను ఆక్రమించారని వారిపై,ఏసీబీ, సి ఐ డి, రెవిన్యూ సిట్ వేసి సమగ్ర ఎంక్వైరీ వేసి వారి పై ల్యాండ్ క్యాబేరింగ్ యాక్ట్ క్రింద కేసులు బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు ,మంత్రి నారాయణ గారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దేవాలయ భూములను, పేదల భూములను కాపాడాలని వాటిని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లి గ్రూప్ టెంపుల్స్ ఈవో డి.ప్రమీల, ఉండవల్లి వేణుగోపాలస్వామి అర్చకులు శ్రీనివాసాచార్యులు, మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

భయమెరుగని విప్లవ వీరులకు ఘన నివాళులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *