యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి 23 ఏళ్ల వయసులోనే తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల 95 వ వర్ధంతి సందర్భంగా పరాయి దేశాల మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న అమెరికా దురాక్రమణాలకి యుద్దోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదామని ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిద్దేశ్వర్, శ్రీకాంత్ లు అన్నారు.
భగత్ సింగ్ 95వ వర్ధంతి ఆలేరులోని సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్, సిద్దేశ్వర్, శ్రీకాంత్ లు మాట్లాడుతూ భారతదేశాన్ని 200 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 23 ఏళ్ల వయసులోనే పోరాడి తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన ఆ మహావీరుల స్ఫూర్తితో ఇవాళ ప్రపంచ దేశాలపై యుద్ధాల పేరుతో తమ దురాక్రమణాలను కొనసాగిస్తున్న అమెరికా సామ్రాజవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని, ఆనాడు భగత్ సింగ్ స్వతంత్రం అంటే పాలకులు మారడం కాదని పరిపాలన విధానం మారాలని చెప్పారని తెల్లవాడు పోయి నల్లవాడు రావడం స్వతంత్రం కాదని, బానిస బ్రతుకులు పోవాలని, ప్రతి మనిషికి స్వేచ్ఛ కావాలని అదే నిజమైన స్వతంత్రం అని, ఇవాళ అమెరికా ఇరాన్ పై చేస్తున్న యుద్ధం కేవలం తమ అధిపత్యాన్ని చలాయించడానికి మాత్రమే అని, ఇజ్రాయిల్ తో కలిసి ఒక దేశ అధ్యక్షుడు చంపడం ఆ దేశం పై విచ్చలవిడిగా బాంబు దాడులు చేయడం, ఇది శాంతికి వ్యతిరేకమని ప్రతి దేశానికి తమ సార్వభౌమాధికారం ఉంటుందని, దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదని, ఇవాళ దేశంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ అమెరికాకి తొత్తుగా మారి ట్రంపు చెప్పిన ప్రతిదానికి వత్తాసు పలుకుతున్నారని, మిత్ర దేశమైన ఇరాన్ ని కాదని, ఇజ్రాయిల్ కి మద్దతు పలకడం ఇరాన్ నుంచి రావాల్సిన ఆయిల్ సంపదలు రాకుండా ఆగిపోవడం, దేశంలో గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల కొరతకు కారణమైందని, ఈ కారణంతో గ్యాస్ ధరలను పెంచి సామాన్యులపై అధిక భారం మోపారని, వీటన్నిటికీ కారణం అమెరికా యుద్ధం మాత్రమే అని, ట్రంప్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించిన భగత్ సింగ్ రాజగురు సుగదేవుల వర్ధంతి సభలను మార్చి 23 నుండి 30 వరకు వాడవాడల జరపాలని కోరారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ. జిల్లా అధ్యక్షులు ఆర్.ఉదయ్, పి.వై. ఎల్. జిల్లా సహాయ కార్యదర్శి ఎలగందుల సిద్ధులు, కుమారస్వామి, శికిలం వెంకటేష్, ఆకుల కృష్ణ, తమ్మడి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
