బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

చెట్ల ముకుందాపురంలో సంపూర్ణ మద్యపాన నిషేధం!

చెట్ల ముకుందాపురంలో సంపూర్ణ మద్యపాన నిషేధం!

సర్పంచ్ పొనుగోటి నరేందర్ కీలక నిర్ణయం.

సూర్యాపేట, మార్చి 24. (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంగ్రామాల్లో మద్యపానం వల్ల కలిగే అనర్థాలను అరికట్టి, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మండల పరిధిలోని చెట్ల ముకుందాపురం గ్రామస్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సర్పంచ్ పొనుగోటి నరేందర్ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ఏకమై గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పొనుగోటి నరేంద్ర మాట్లాడుతూ, మద్యం మహమ్మారి వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని, ముఖ్యంగా యువత ఆరోగ్యం పాడవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధిని కాంక్షించి, అందరి సహకారంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.తీర్మానం అనంతరం సర్పంచ్ , గ్రామ పెద్దలు గ్రామంలోని వీధివీధినా తిరుగుతూ మద్యపాన నిషేధంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. మద్యం విక్రయించినా, సేవించినా భారీ జరిమానాలు విధిస్తామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసు చర్యలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండమీది భవాని, వార్డు మెంబర్స్ అనంతుల రామకృష్ణ, గడ్డం నవ్య, వాస సంధ్య, సూరపల్లి సైదులు,ఎర్రమళ్ళ సన్నీ, గడ్డం శంకర్, వాస కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి