బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

యుద్ధంలో ఎవరి పక్షం..? మోదీ క్లారిటీ

యుద్ధంలో ఎవరి పక్షం..? మోదీ క్లారిటీ

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: What India Thinks Today Summit కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పటికీ, భారత్ తన దిశలో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. ముఖ్యంగా యుద్ధ పరిస్థితులపై మాట్లాడుతూ.. “భారతదేశం ఎవరి పక్షాన ఉందని అడుగుతున్నారు. మా సమాధానం ఒకటే – మేము భారతదేశంతో ఉన్నాం. మేము శాంతికి, చర్చలకు మద్దతు ఇస్తాం” అని స్పష్టం చేశారు.ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచం విభజన దిశగా వెళ్తోందని, కానీ భారత్ మాత్రం సమతుల్య విధానంతో విశ్వసనీయ మిత్రదేశంగా నిలుస్తోందని ప్రధాని పేర్కొన్నారు.కరోనా తర్వాత ప్రపంచ సరఫరా గొలుసులు దెబ్బతిన్నప్పటికీ, భారత్ స్థిరత్వం, వైవిధ్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఇంధనం, ఎరువులు, నిత్యావసర వస్తువుల విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.గత ఐదు, ఆరు సంవత్సరాల సవాళ్లను గుర్తు చేస్తూ.. COVID-19 తర్వాత కూడా భారత్ ప్రతి సంక్షోభాన్ని విజయవంతంగా ఎదుర్కొందని అన్నారు. 140 కోట్ల మంది ప్రజల ఐకమత్యమే దేశ బలమని ప్రధాని తెలిపారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ