Breaking News

మళ్లీ మోసాలకు పాల్పడుతున్న క్యూనెట్.. పోలీసుల భారీ దాడులు

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మళ్లీ విస్తరిస్తున్న QNet మోసాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. యువత, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో మోసాలకు పాల్పడుతున్న ఈ నెట్‌వర్క్‌పై మూడు రాష్ట్రాల్లో ఒకేసారి దాడులు నిర్వహించారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 30 ప్రాంతాల్లో సోదాలు జరిపిన పోలీసులు 32 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌పై వీసీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు.ఈ మోసాల్లో ప్రధానంగా “సెకండ్ ఇన్‌కమ్” అనే మాటతో యువతను ఆకర్షిస్తున్నారు. మంచి బిజినెస్ అవకాశం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ నమ్మబలికి నెట్‌వర్క్‌లోకి దింపుతున్నారు.

ప్రత్యేకంగా డబ్బులు లేని వారికోసం ఫిన్‌టెక్ సంస్థల ద్వారా లోన్లు ఇప్పించి మరింతగా బంధంలో పడేస్తున్నారు. గోవా, మలేషియా ట్రిప్‌లు, ఖరీదైన కార్లు, విల్లాలు చూపిస్తూ లగ్జరీ జీవితాన్ని చూపించి మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.మొదట వెల్‌నెస్ ప్రాడక్ట్స్ పేరుతో ప్రారంభమైన ఈ నెట్‌వర్క్.. ఇప్పుడు సాధారణ వస్తువులను కూడా విక్రయిస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. కంపెనీ పేరు బయటపెట్టకుండా బాండ్లు రాయించుకుని పెట్టుబడులు సేకరించడం గమనార్హం.తెలంగాణలో ఇప్పటికే డజన్ల కొద్దీ కేసులు నమోదవగా, పలువురు బాధితులు తీవ్రంగా నష్టపోయారు.

“భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా పెత్తనం ఎందుకు?” – ఒవైసీ ప్రశ్నలు

పోలీసుల సూచన:
అధిక లాభాల ఆశ చూపించే స్కీమ్స్‌పై నమ్మకం పెట్టుకోవద్దని, ఎవరైనా ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఓవర్సీస్ విద్యా నిధులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *