బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

ప్రధాన పార్టీలకు షాక్.. విజయ్ బిగ్ గేమ్ ప్లాన్!

ప్రధాన పార్టీలకు షాక్.. విజయ్ బిగ్ గేమ్ ప్లాన్!

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల వేడి పీక్స్‌కు చేరుకున్న వేళ, సినీ నటుడు విజయ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు. ఆయన స్థాపించిన తమిళగా వెట్రి కజగం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుని, మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే పోటీకి దిగింది.నామినేషన్ల గడువు ముగిసే సరికి ప్రధాన పార్టీలైన భారత జాతీయ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం కూటమిలో సీట్ల సర్దుబాటుపై చివరి నిమిషం వరకు చర్చలు కొనసాగాయి. చివరికి కాంగ్రెస్ 16, డీఎంకే 12, మిగతా మిత్రపక్షాలకు 2 సీట్లు కేటాయిస్తూ ఒప్పందం కుదిరింది.

ఇక ఎన్డీఏ కూటమిలో ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ 16 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఇతర మిత్రపక్షాలు మిగిలిన సీట్లలో బరిలోకి దిగుతున్నాయి.అయితే, ఈ కూటముల గందరగోళం మధ్య విజయ్ మాత్రం ముందుగానే తన వ్యూహాన్ని అమలు చేశారు. టీవీకే పార్టీ అన్ని 30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి, నామినేషన్లు కూడా పూర్తి చేయించడం ద్వారా రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది.తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలతో పొత్తుల కోసం ప్రయత్నాలు జరిగినప్పటికీ, విజయ్ మాత్రం ఎవరితోనూ కలవకుండా స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో కొత్త పార్టీగా టీవీకే తీసుకున్న ఈ ధైర్యవంతమైన నిర్ణయం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ