మంగళగిరి, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు.ప్రత్యేకంగా, రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని AP కేబుల్ ఆపరేటర్లు JAC ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.వారి వినతులను పరిశీలించిన మంత్రి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడమే ప్రజాదర్బార్ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
మంగళగిరిలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల సమస్యలపై హామీ
