Breaking News

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ రాయితీలు.. ప్రభుత్వ నిర్ణయం

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రంలో అమలు చేస్తున్న EV పాలసీ కింద ఉద్యోగులు, సాధారణ ప్రజలకు ప్రత్యేక రాయితీలు అందించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 15% నుంచి 20% వరకు డిస్కౌంట్ కల్పించేలా వాహన తయారీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రక్రియలో ప్రభుత్వం ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

స్క్రాపేజీ పాలసీతో అదనపు ప్రయోజనాలు

పాత వాహనాలను తొలగించేందుకు అమలు చేస్తున్న స్క్రాపేజీ పాలసీ కింద:
✔ పన్ను బకాయిల మాఫీ
✔ కొత్త వాహనాలపై ట్యాక్స్ రాయితీలు
✔ బైక్‌లకు రూ.5,000 వరకు
✔ కార్లకు రూ.50,000 వరకు ప్రయోజనం

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అదేవిధంగా, సాధారణ ప్రజలకు కూడా ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుపై రూ.1 లక్ష వరకు ప్రోత్సాహకం అందించనున్నారు. రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై పూర్తి మినహాయింపు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.ఇక ప్రజా ప్రతినిధులకు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక రుణ సౌకర్యాలు అందించనున్నారు.పాత వాహనాలను తొలగించేందుకు అమలు చేస్తున్న స్క్రాపేజీ పాలసీ ద్వారా ట్యాక్స్ రాయితీలు, ఇతర ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నారు.ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగి, కాలుష్యం తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *