బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

ఒవైసీ ఆరోపణలు తప్పు.. భారతదేశంలో పూర్తి స్వేచ్ఛ ఉంది: కిషన్ రెడ్డి

ఒవైసీ ఆరోపణలు తప్పు.. భారతదేశంలో పూర్తి స్వేచ్ఛ ఉంది: కిషన్ రెడ్డి

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: TV9 నెట్‌వర్క్ నిర్వహించిన ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ (WITT) కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఇంధన రంగం ప్రస్తుతం సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం స్వయం సమృద్ధి దిశగా పనిచేస్తోందని తెలిపారు. దేశంలో ప్రస్తుతం 82-85 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, విద్యుత్ సరఫరాపై ఎలాంటి పెద్ద సమస్య లేదని స్పష్టం చేశారు.

ఒవైసీ వ్యాఖ్యలపై స్పందన

అసదుద్దీన్ ఒవైసీ చేసిన ఆరోపణలను ఖండిస్తూ, భారతదేశంలో మత స్వేచ్ఛ పూర్తిగా ఉందన్నారు.“ఇది పాకిస్తాన్ కాదు.. భారత్‌లో అందరికీ స్వేచ్ఛ ఉంది. ఏ మతానికీ ఇబ్బంది లేదు. అయితే స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదు” అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీపై విమర్శలు

రాహుల్ గాంధీపై కూడా ఆయన విమర్శలు చేశారు.దేశానికి కీలకమైన అంశాల్లో ఆయన సరైన వైఖరి ప్రదర్శించలేదని ఆరోపించారు. కోవిడ్ వ్యాక్సిన్, జీఎస్టీ, ఆర్టికల్ 370 వంటి నిర్ణయాలను వ్యతిరేకించడం సరైనది కాదన్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఎన్నికలపై అంచనా

వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై స్పందిస్తూ పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. అక్కడ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో తిరిగి తమ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.