విజయవాడ. మార్చి 24 పశ్చిమ నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: ఎన్టీఆర్ జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మంగళవా రం మధ్యాహ్నం విజయ వాడ పశ్చిమ నియోజక వర్గం, కాలేశ్వరరావు మార్కెట్ సమీపంలోని గాంధీజీ మున్సిపల్ స్కూల్‌లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథ కాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిం చారు. ఆమె ప్రతిరోజూ అందుతున్న భోజన మెనూ, నాణ్యత, రుచిపై వివరంగా ఆరా తీసి విద్యార్థుల సంక్షేమం పై తమ ప్రభుత్వ చిత్తశు ద్ధిని మరోసారి చాటారు. విద్యార్థులకు స్వయంగా వడ్డించి, భోజనం రుచి గురించి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేయడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా రంగం లో నాణ్యమైన మార్పు లు చోటుచేసుకుంటు న్నాయని తెలిపారు. ముఖ్యంగా డొక్కా సీత మ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పరిశుభ్ర త, పోషకాహారం, నాణ్య తపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పాఠశాలలను స్వయంగా సందర్శిస్తూ భోజన నాణ్యతను పరిశీలించే విధానం వల్ల విద్యార్థుల కు మెరుగైన ఆహారం అందడమే కాకుండా తల్లి దండ్రుల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతోందని పేర్కొన్నారు. స్కూల్లో అందించిన భోజనం రుచికరంగా, పరిశుభ్రంగా ఉండటంపై ఆమె సంతో షం వ్యక్తం చేస్తూ, వంట సిబ్బంది, పాఠశాల సిబ్బం దిని అభినందించారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్య రెండింటినీ సమా నంగా ప్రాముఖ్యతనిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ప్రతి రోజూ మెనూ ప్రకారం నాణ్యమై న ఆహారం అందించాల ని, వంటగది పరిశుభ్రత ను కచ్చితంగా పాటించా లని, విద్యార్థుల ఆరోగ్యం పై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సిబ్బందికి సూచించారు. తల్లిదండ్రు లతో సమన్వయం పెంచు కోవాలని, ఇలాంటి ఆకస్మి క తనిఖీలు నిరంతరం కొనసాగిస్తూ ప్రభుత్వ పథకాల అమలు పారద ర్శకంగా జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం లో నాసిరకం బియ్యంతో భోజనం అందించగా, నారా చంద్ర బాబు నాయుడు నెత్రు త్వంలోని ప్రస్తుతం కూట మి ప్రభుత్వం సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నదని పేర్కొన్నారు. భోజన నాణ్యత లోపించిన కార ణంగా గత వైసీపీ పాలన లో విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకు నే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందని తెలి పారు. ప్రస్తుతం అందుతు న్న భోజనంపై విద్యార్థులు తల్లిదండ్రులు సంతృప్తిగా ఉన్నారని, అందువల్లే విద్యార్థులంతా పాఠశాల లోనే భోజనం చేస్తున్నార ని పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి పరి ష్కార చర్యలు తీసుకుం టున్నారని, ప్రభుత్వ పథకాల అమలు మరింత మెరుగుపడేలా కృషి కొనసాగుతుందని గద్దె అనురాధ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్య క్షురాలు షేక్ ఆషా, గొల్ల పూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, స్కూల్ హెడ్ మాస్టర్ మల్లికార్జున రెడ్డి, పశ్చిమ నియోజవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు షేక్ నసీమా, ప్రధాన కార్యదర్శి పితాని పద్మ, 37 డివిజన్ అధ్యక్షులు మురళి, 37 డివిజన్ బూత్ కన్వీనర్ బోసు బాబు, 35 వ డివిజన్ అధ్యక్షురాలు షేక్ నంద కుమారి, పశ్చిమ నియో జకవర్గం ఐటీడీపీ అధ్య క్షులు మధురాంతకం సాయి చైతన్య, తెలుగు మహిళలు కసింకోట మల్లే శ్వరి, పుప్పాల దుర్గ, పట్నాల భార్గవి,ప్రియాంక శాంతి, మెండు జ్యోతి, లంకా బుజ్జి గౌరీ, సయ్య ద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

