బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే షాక్.. వాహనం సీజ్ అయ్యే ఛాన్స్!

5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే షాక్.. వాహనం సీజ్ అయ్యే ఛాన్స్!

హైదరాబాద్‌, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న వాహనదారులకు భారీ షాక్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇకపై పెండింగ్ చలాన్లు ఉంటే కేవలం జరిమానాతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోనుందికొత్త ట్రాఫిక్ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనల ప్రకారం, ఒక వాహనంపై ఏడాదిలో 5 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉంటే, ఆ వాహనానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది.

అంతేకాదు, ఫైన్ చెల్లించేందుకు ప్రభుత్వం 45 రోజుల గడువు ఇవ్వనుంది. ఈ సమయంలో కూడా చెల్లించకపోతే వాహనాన్ని సీజ్ చేసే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకసారి లైసెన్స్ ఫ్రీజ్ అయితే వాహనాన్ని రోడ్డుపై నడపడం చట్ట విరుద్ధం అవుతుంది.ఈ నూతన నిబంధనల అమలుకు అనుగుణంగా ప్రభుత్వం గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీను కూడా ఏర్పాటు చేయనుంది. టెక్నికల్ సమస్యల వల్ల తప్పుగా పడిన చలాన్లపై వాహనదారులు ఫిర్యాదు చేసి పరిష్కారం పొందవచ్చు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. చలాన్లను లైట్ తీసుకోవద్దని, ప్రజల భద్రత కోసం నిబంధనలు పాటించడం తప్పనిసరి అని సూచించారు.మొత్తంగా, చలాన్లు పెండింగ్‌లో ఉంచితే ఇక తప్పించుకునే మార్గం లేదు. వాహనదారులు వెంటనే ఫైన్లు చెల్లించి, ట్రాఫిక్ రూల్స్ పాటించడం అత్యంత అవసరం.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి