Breaking News

జగిత్యాలలో రాజకీయ హీట్.. జీవన్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు

జగిత్యాల, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత టి జీవన్ రెడ్డిను బుజ్జగించేందుకు హైకమాండ్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆయన నివాసానికి వంశీచంద్ రెడ్డి చేరుకుని సుమారు 20 నిమిషాల పాటు కీలక చర్చలు జరిపారు.ఇక ఉదయం కూడా కాంగ్రెస్ నేత మహేష్ గౌడ్ జీవన్‌రెడ్డిని కలిసి పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. పార్టీ లోపలి పరిణామాల నేపథ్యంలో ఈ భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.అయితే, రాజీనామా విషయంలో జీవన్‌రెడ్డి తన నిర్ణయంపై కట్టుదిట్టంగా నిలిచినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా, ఈ పరిణామాలు కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయాలపై ఆసక్తిని పెంచుతున్నాయి.

మహిళా సాధికారతకు కొత్త దిశ.. తెలంగాణలో జిల్లా మహిళా సమాఖ్య భవనాలు సిద్ధం

కరీంనగర్ ఘటనపై డీజీపీకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *