బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
స్పోర్ట్స్

కొత్త యజమానుల చేతుల్లోకి రాజస్థాన్ రాయల్స్.. రికార్డ్ ధరకు డీల్

కొత్త యజమానుల చేతుల్లోకి రాజస్థాన్ రాయల్స్.. రికార్డ్ ధరకు డీల్

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద డీల్ కుదిరింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు సుమారు 1.65 బిలియన్ డాలర్లు (రూ.15,000 కోట్లు)కు అమ్ముడై సంచలనం సృష్టించింది.అమెరికాకు చెందిన భారత సంతతి వ్యాపారవేత్త కాల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును సొంతం చేసుకుంది. ఈ డీల్‌తో ఐపీఎల్ ఫ్రాంచైజీలలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక అమ్మకంగా ఇది రికార్డు సృష్టించింది. ఈ కన్సార్టియంలో వాల్‌మార్ట్ వారసుడు రాబ్ వాల్టన్, ఫోర్డ్ మోటార్ కంపెనీ కుటుంబానికి చెందిన షీలా ఫోర్డ్ హాంప్ వంటి ప్రముఖులు భాగస్వాములుగా ఉన్నారు. స్పోర్ట్స్ బిజినెస్‌లో వీరికి ఉన్న అనుభవం జట్టుకు కీలకంగా మారనుంది.

ఇప్పటివరకు జట్టులో మెజారిటీ వాటా కలిగి ఉన్న మనోజ్ బదాలే సహా పాత యాజమాన్యం పూర్తిగా బయటకు వెళ్లగా, కొత్త బృందం 100% వాటాను స్వాధీనం చేసుకుంది.ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ (2008) ఛాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్, కొత్త యాజమాన్యం రాకతో గ్లోబల్ స్థాయిలో బ్రాండ్ విలువను పెంచే దిశగా అడుగులు వేయనుంది.మొత్తం మీద, ఈ మెగా డీల్ ఐపీఎల్ మాత్రమే కాకుండా ప్రపంచ స్పోర్ట్స్ బిజినెస్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్