బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్‌బై.. 1500 మందితో కలిసి రాజీనామా

కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్‌బై.. 1500 మందితో కలిసి రాజీనామా

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేశారు.గత కొన్ని రోజులుగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న ఆయన, ఇవాళ అధికారికంగా రాజీనామా ప్రకటించారు. అనుచరులతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు సుమారు 1500 మంది కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పడం విశేషం.ఈ సందర్భంగా జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొంతమంది తనను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగిత్యాలలో తన రాజకీయ ఉనికిని దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

తన రాజకీయ జీవితంలో పోరాటం కొత్త కాదని, గతంలో నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులతో పోరాడినట్లు గుర్తుచేశారు. అవసరమైతే ప్రస్తుత సీఎం ఎ. రేవంత్ రెడ్డితో కూడా పోరాటానికి సిద్ధమని ప్రకటించారు.రాజీనామాకు ముందు తాను పార్టీ మారే ఆలోచన లేదని చెప్పినప్పటికీ, పరిస్థితులు మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను పార్టీలోకి అనుమతించవద్దని కోరినప్పటికీ, తన అభిప్రాయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు.మొత్తంగా, జీవన్ రెడ్డి రాజీనామా తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ చర్చలకు దారి తీసింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి