బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త.. కొత్త కేటాయింపులు త్వరలో

ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త.. కొత్త కేటాయింపులు త్వరలో

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన చేసింది. త్వరలోనే రెండో విడత ఇళ్ల మంజూరు చేపట్టనున్నట్లు వెల్లడించింది.ఈ విషయాన్ని అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఈ నెలలో లక్షా 12 వేల ఇళ్లు పూర్తి అవుతున్నాయని, జూన్ నాటికి మరో లక్ష ఇళ్లు పూర్తికానున్నాయని తెలిపారు.ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను కేటాయించినట్లు మంత్రి చెప్పారు. ఏప్రిల్ చివరి వారం లేదా మే నెల నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.గతంలో మధ్యలోనే ఆగిపోయిన గృహలక్ష్మీ ఇళ్లకు కూడా నిధులు అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే ఇల్లు నిర్మించుకుని డబ్బులు అందని లబ్ధిదారులకు ఇది ఊరటనివ్వనుంది.పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్తో పాటు ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ నగరాల్లో కూడా ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు చెప్పారు.ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి