బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో దివ్యాంగులకు శుభవార్త.. నెలకు రూ.6 వేల పెన్షన్ అవకాశం

ఏపీలో దివ్యాంగులకు శుభవార్త.. నెలకు రూ.6 వేల పెన్షన్ అవకాశం

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియను మార్చి 25 నుంచి తిరిగి ప్రారంభించింది. ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది కొత్తగా పింఛన్ పొందే అవకాశం లభించనుంది.సదరం సర్టిఫికేట్ పొందిన వారికి ప్రతీ నెల రూ.6,000 పింఛన్ అందనుంది. అంతేకాకుండా, ఇతర ప్రభుత్వ పథకాలు, రాయితీలు పొందేందుకు కూడా ఈ సర్టిఫికేట్ కీలకంగా మారింది.స్లాట్ బుకింగ్‌ను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉచితంగా చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎలాంటి ఫీజు లేకుండా సులభంగా నమోదు చేసుకునే వీలుంది. ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు.

ఈ నెల 30 నుంచి టెస్టులు ప్రారంభం కానున్నాయి. అర్హత ఉన్నవారికి సదరం సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఈసారి మొత్తం ప్రక్రియను డిజిటల్ విధానంలో అమలు చేయడం ద్వారా పారదర్శకతను పెంచారు.స్లాట్ బుకింగ్ కోసం ఆధార్, మొబైల్ నెంబర్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, వైకల్యం వివరాలు అవసరం. సర్టిఫికేట్ పొందిన వారు పింఛన్‌తో పాటు ఉచిత బస్ ప్రయాణం, సబ్సిడీలు వంటి అనేక ప్రయోజనాలు పొందవచ్చు.గతంలో నిలిచిపోయిన సర్టిఫికేట్ జారీని తిరిగి ప్రారంభించడంతో దివ్యాంగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇది వారి జీవితాల్లో ఆర్థిక భద్రతను పెంచే కీలక నిర్ణయంగా మారనుంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్