Breaking News

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలీ

  • మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జన్నాయికోడే నగేష్ డిమాండ్

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ప్రభుత్వ విప్ , ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జన్నాయికోడే నగేష్ డిమాండ్ చేశారు. బుధవారం రోజు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు జన్నాయికోడె నగేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన బీర్ల ఐలయ్య ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడని పేర్కొన్నారు. ఎలాంటి పదవి లేకున్న కరోనా సమయంలో ప్రతి గ్రామంలో ప్రజలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు, మాస్కులు, తాగునీరు, అంబులెన్స్ సౌకర్యం అందించారని గుర్తుచేశారు.ఆనాడు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అదే అప్పటి ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యురాలు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారిని వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి తమ గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరితే లేదు అని మీరు గ్రామ పంచాయతీ తీర్మాణం ఇచ్చిన ఇవ్వకున్న తమ బి ఆర్ ఎస్ నాయకులకు కార్యకర్తలకు పనులు ఇస్తామని అవమానించారన్నారు. తీర్మానాలు ఇచ్చిన అన్ని చోట్ల పనులు చెయ్యని దద్దమ్మ లు మీరు ఇప్పుడు నిధులు ఇవ్వడం లేదు అనడం సిగ్గు చేటు అని వారు అన్నారు.గత రెండు సంవత్సరాల్లో ఎమ్మెల్యే గా గెలిచాక ఆత్మకూరు మండలంలోని బి.ఆర్.ఎస్ పార్టీ సర్పంచులు ఉన్న గ్రామాలకు గణనీయంగా అభివృద్ధి నిధులు మంజూరు చేశారు.ఆత్మకూరు టౌన్ కి 3 కోట్ల 50 లక్షలు, పల్లెపహాడ్ 80 లక్షలు, రాఘవపురం 30 లక్షలు, పుల్లాయిగూడెం 30 లక్షలు, రహీంఖాన్‌పేట 40 లక్షలు, ఖప్రయిపల్లి 40 లక్షలు, తుక్కాపురం 40 లక్షలు, మొదుగుబావిగూడెం 10 లక్షలు నిధులు కేటాయించారని తెలిపారు. ప్రస్తుతం గెలిచిన బి ఆర్ ఎస్ సర్పంచులు నోరు అదుపులో పెట్టుకొని ఆత్మ పరిశీలన చేసుకొని గౌరవ ప్రధంగా ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య గారితో కలిసి గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అంకితభావంతో పనిచేయాలని పని కట్టుగొని వ్యక్తి గత విమర్శలు చేస్తే మా నాయకులు కార్యకర్తలు తగిన గుణపాఠం చెపుతారు అని హెచ్చరించారు.ప్రజా ప్రతినిధులు పరస్పరం గౌరవంతో వ్యవహరించి, గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు…ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు సుబ్బురు వెంకటేశ్వర్లు, దయ్యాల రాజు, కొమిరెల్లి రాంరెడ్డి, సుంకిశాల ఎల్లయ్య ,జామ యాదయ్య,ఎర్ర గీత మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

పోటో: అవార్డ్ అందుకుంటున్న మై హోం యాజమాన్యం (ఎమ్ ఎల్ సి 01)

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు చల్లని చలివేంద్రాలు ఏర్పాటు: ఎంపీడీవో బి. శ్రీనివాసరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *