బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం డ్యామ్ వద్ద విషాదం.. కానిస్టేబుల్ మృతి

శ్రీశైలం డ్యామ్ వద్ద విషాదం.. కానిస్టేబుల్ మృతి

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: శ్రీశైలం డ్యామ్ వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి ప్రాణాలు కోల్పోయారు.నంద్యాల జిల్లా సున్నిపెంట పరిధిలో డ్యామ్ వద్ద పహారా కాస్తున్న సమయంలో ఆకస్మికంగా తేనెటీగల గుంపు ఆయనపై దాడి చేసింది. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తీవ్ర భయంతో పరుగులు తీసిన ఆయన కింద పడిపోయారు.వందలాది తేనెటీగలు కుట్టడంతో పాటు, తీవ్ర భయంతో గుండెపోటు వచ్చినట్లు సమాచారం. వెంటనే సహచర సిబ్బంది ఆయనను సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.ఈ ఘటనలో మరో ఇద్దరు సిబ్బందికి గాయాలు కాగా, ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.బాపట్ల జిల్లా చీరాల సమీపానికి చెందిన వీరస్వామికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.ఈ ఘటనతో డ్యామ్ పరిసరాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. అధికారులు సంఘటనపై విచారణ చేపట్టారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్