బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

వైన్స్ షాపులకు దేవుళ్ల పేర్లు వద్దు.. అసెంబ్లీలో బీజేపీ డిమాండ్

వైన్స్ షాపులకు దేవుళ్ల పేర్లు వద్దు.. అసెంబ్లీలో బీజేపీ డిమాండ్

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు వేడెక్కుతున్నాయి. ఈ సందర్భంగా ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా కీలక డిమాండ్‌ను ముందుకు తీసుకువచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు దేవుళ్ల పేర్లు తొలగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. హిందూ మత భావాలను అవమానించేలా వైన్స్ షాపులకు దేవుళ్ల పేర్లు పెట్టడం సరైంది కాదని అసెంబ్లీలో పేర్కొన్నారు.మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇస్తున్న సమయంలోనే దేవుళ్ల పేర్లను అనుమతించకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అనేక మద్యం దుకాణాలు దేవుళ్ల పేర్లతోనే నడుస్తున్నాయి. గిరాకీ పెరుగుతుందనే నమ్మకంతో వ్యాపారులు ఇలాంటి పేర్లు పెట్టుకుంటున్నారని సమాచారం.ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో ఇప్పటికే దేవుళ్లు, చారిత్రక ప్రముఖుల పేర్లను మద్యం దుకాణాలకు ఉపయోగించడంపై నిషేధం విధించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి