విజయవాడ. మార్చి 26 సెంట్రల్ నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీ ప్యాట్ల గోదాముకు పటిష్ట భద్రత కల్పించడం జరిగి నప్పటికీ. నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తం గా ఉండాలని సమన్వయ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఆదేశాలు, మార్గ దర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీ లలో భాగంగా రాజకీయ పార్టీ ల ప్రతినిధులతో కలి సి గురువారం జిల్లా కలెక్ట ర్ డా. జి.లక్ష్మీశ విజయ వాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఈవీఎం, వీవీ ప్యాట్ల గోదామును పరిశీలించారు. భద్రతా చర్యల్లో భాగంగా ఏర్పా టు చేసిన సీసీ కెమెరాల పని తీరుతో పాటు అగ్ని మాపక పరికరాలను పరి శీలించి అనంతరం పర్య వేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడు తూ ఈసీఐ మార్గదర్శకా లకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదాము ను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందించడం జరుగుతోందన్నారు. అదే విధంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతిని ధుల సమక్షంలోను ఎప్ప టికప్పుడు తనిఖీలు నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది నిరంతరం అప్ర మత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణ తో గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారుల కు సూచించారు.ఈవీఎం, వీవీప్యాట్ల గోదాము తని ఖీలో జిల్లా కలెక్టర్ తో పాటు డీఆర్వో ఎం. లక్ష్మీ నరసింహం, కాకాని తరు ణ్, బి.కృష్ణా రెడ్డి (భాజపా), కె.సురేష్ (తెదేపా), వై.ఆంజనేయ రెడ్డి (వైఎస్ఆర్‌సీపీ) తది తరులు పాల్గొన్నారు.

