Breaking News

శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కరీంనగర్, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: శ్రీ రాముని మహోన్నత గుణాలను స్మరించుకుంటూ, ఆయన ఆదర్శాలను ఆచరణలో పెట్టే సంకల్పంతో శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ధర్మానికి ప్రతీకగా నిలిచిన శ్రీ రాముడు సత్యం, కర్తవ్యనిష్ఠ, వినయం, పరస్పర గౌరవం వంటి విలువలను ప్రపంచానికి చూపించాడు. అదే విధంగా శ్రీ సరస్వతీ విద్యాపీఠం విద్యతో పాటు విలువలను బోధిస్తూ, సమాజానికి ఆదర్శ పౌరులను తీర్చిదిద్దడంలో విశేష పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శ్రీ సరస్వతీ విద్యాపీఠం పరిధిలో 176 పాఠశాలలు, 44,000 మంది విద్యార్థులు, 2,600 మంది ఉపాధ్యాయులు మరియు సిబ్బంది, 5 లక్షలకు పైగా పూర్వ విద్యార్థులతో విశాలమైన విద్యా వృక్షంగా ఎదిగి దేశ అభివృద్ధికి తోడ్పడుతోందని ఎలగందుల సత్యనారాయణ అన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం మరియు శిశుమందిర్ పాఠశాలలు భవిష్యత్తులో కూడా విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి కట్టుబడి పనిచేస్తాయని పాఠశాల ప్రధానాచార్యులు రణధీర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో ఇంజనీర్ కోల అన్నా రెడ్డి, మెచినేని దేవేందర్ రావు, తాటి రాజేశ్వర్ రావు, కొత్తూరి ముకుందం, శ్రీరామోజు రవి, గట్టు రాంప్రసాద్, ఆచార్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *