Breaking News

రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చనున్న మిట్టల్ స్టీల్ ప్లాంట్: టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ

విజయవాడ. మార్చి 26 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కూటమి ప్రభుత్వం ఏ మంచి పని చేసినా మాజీ ముఖ్యమంత్రి జగన్ మొదట “వేస్ట్” అంటూ దాన్ని నేనే అడ్డుకుంటా అంటాడని, కానీ అదే ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చి, ప్రజల్లో కూటమికి మంచి పేరు వస్తుందని తెలిసిన వెంటనే “ఆ ప్రాజెక్ట్ తెచ్చిం దే నేనే” అంటూ ఊసరవె ల్లిలా రంగులు మారుస్తా డని, జగన్ అబద్దాలకు అంతే లేదని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ విమర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమా వేశంలో ఆమె మాట్లాడు తూ అనకాపల్లి జిల్లాలో అర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరగడం రాష్ట్ర పారిశ్రామి క అభివృద్ధికి చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింద ని గద్దె అనురాధ నేడు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా భారీ పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రే టెడ్ స్టీల్ ప్లాంట్‌కు శంకు స్థాపన జరగడం ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి పథంలో గొప్ప ముందడుగని తెలి పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కుమారస్వామి పాల్గొన డం రాష్ట్రానికి ఉన్న ప్రాముఖ్యతను చాటింద న్నారు. ఇది కేవలం స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలిచే ఉపాధి యంత్రం గా మారబోతుందని గద్దె అనురాధ స్పష్టం చేశారు.
ప్రపంచం కుబేరుడైన లక్ష్మీ శ్రీనివాస్ మిట్టల్ లాంటి వారు రూ.1,35,964 కోట్ల రాష్ట్రానికి వచ్చి పెట్టుబ డులు పెట్టారు అంటే దానికి ప్రధాన కారణం చంద్రబాబుకున్న నిబద్ద త, దార్శినికతకు నిదర్శ నం అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడిదారులను ఆహ్వానించడం, ఒప్పందా లు చేసుకోవడం, దానికి కావలిసిన అన్ని అనుమ తులు త్వరితగతిన తీసు కోవడం, శంకుస్థాపనలు చేయడంలో నారా లోకేష్ పట్టుదలకు నిదర్శనమ న్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరో క్షంగా దాదాపు లక్ష మంది కి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని, ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో రాష్ట్రాన్ని పారిశ్రామికంగా బలోపేతం చేసే శక్తి ఈ ప్లాంట్‌కు ఉందన్నారు. మొత్తం 5,465 ఎకరాల్లో రెండు దశల్లో నిర్మితమవు తున్న ఈ ప్రాజెక్టు స్థానిక ఆర్థిక వ్యవస్థకు బలమైన ఊతమివ్వడంతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్ర మలకు కొత్త అవకాశాలు తీసుకువస్తుందని అన్నా రు. జగన్ నాయకత్వం లోని గత వైసీపీ ప్రభు త్వం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేసిందని విమర్శిం చారు. “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అనే నినాదం ప్రజల హృద యాల్లోనాటుకుపోయిండిదని, అటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకర ణ చేసి నాశనం చేయబోయారన్నారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొస్తామని నారా లోకే ష్ చెప్పినప్పుడు, అది అసంభవమని, ప్రజలను మోసం చేస్తున్నారని జగ న్ విమర్శించిన విషయా న్ని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు శంకుస్థాపన జరి గిన తర్వాత ప్రాజెక్టు తీ సుకురావడంలో జగన్ తన క్రెడిట్ గా చెప్పుకోవ డం వైసీపీ ద్వంద్వ వైఖరి కి నిదర్శన మన్నారు. ఈ ప్రాజెక్టుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం హర్షం వ్యక్తం చేయడం రాష్ట్రానికి ఉన్న ప్రాము ఖ్యతను మరింతగా వెల్ల డిస్తోందన్నారు. మొత్తం గా, కూటమి ప్రభుత్వం పరిశ్రమలను ఆకర్షిస్తూ, యువతకు ఉపాధి అవ కాశాలు కల్పిస్తూ రాష్ట్రా న్ని అభివృద్ధి దిశగా తీసు కెళ్తుంటే, జగన్ బ్యాచ్ పరిశ్రమలకు భూములు ఇవ్వవద్దు అంటూ కోర్టుల కు వెళ్లడం, కోర్టులలో కూడా మొట్టికాయలు తినడం అలవాటుగా మారిందన్నారు.

విశాఖ తీరానికి చేరిన భారీ LPG, చమురు నౌకలు… ఇంధన సంక్షోభానికి ఊరట

ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌: జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *