Breaking News

ఇరగదీశాడు భయ్యా… ‘పెద్ది’లో రామ్ చరణ్ రౌద్ర రూపం

హైదరాబాద్, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మేకర్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ నుంచి క్రేజీ టీజర్ విడుదల చేసి సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టించారు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్, తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.ప్రస్తుతం చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రానికి బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంగీతాన్ని ఏ. ఆర్. రెహమాన్ అందిస్తున్నారు. ఈ కాంబినేషన్‌తోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?

తాజాగా విడుదలైన టీజర్‌లో రామ్ చరణ్ మాస్ అవతార్‌లో అదరగొట్టాడు. ముఖ్యంగా కుస్తీ నేపథ్యంలో వచ్చిన సన్నివేశాలు, గద పట్టుకుని కనిపించిన లుక్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. “ఆటే నా ప్రాణం” అనే డైలాగ్ ఇప్పటికే వైరల్ అవుతోంది.ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధిస్తూ సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. ‘పెద్ది’ చిత్రాన్ని ఏప్రిల్ 30న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.గతంలో రంగస్థలం సినిమాలో మాస్ లుక్‌తో ఆకట్టుకున్న చరణ్, ఇప్పుడు ‘పెద్ది’లో మరింత పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించనుండటంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత ఈ సినిమా చరణ్‌కు బిగ్ కంబ్యాక్ అవుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

చిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *