బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ధర్మం, సుపరిపాలనకు ప్రతీక శ్రీరాముడు: చంద్రబాబు

ధర్మం, సుపరిపాలనకు ప్రతీక శ్రీరాముడు: చంద్రబాబు

అమరావతి, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన శ్రీరాముడి మహిమను కొనియాడుతూ, ధర్మానికి, సుపరిపాలనకు ప్రతీకగా నిలిచిన ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడని పేర్కొన్నారు. కర్తవ్యపరాయణత, న్యాయం, నీతి విలువలను పాటించిన మహానుభావుడిగా ఆయనను అభివర్ణించారు.శ్రీరాముడు అవతరించిన రోజు, ఆయన కళ్యాణం జరిగిన రోజు అయిన శ్రీరామనవమిని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. రామరాజ్యం అంటే ప్రజల కోసం పనిచేసే పరిపాలన అని, అలాంటి సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రతి ఒక్కరూ శ్రీరామచంద్రమూర్తి సుగుణాలను ఆచరిస్తూ ఆదర్శ జీవితం గడపాలని, ప్రజలందరికీ శాంతి, సుఖసమృద్ధులు కలగాలని కోరుకున్నారు. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటిలో ఆనందం నింపాలని, శ్రీరాముడి కృపాకటాక్షం అందరికీ లభించాలని సీఎం ఆకాంక్షించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్