బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

మెగా బ్రదర్స్ పై అభిమానాన్ని చాటుకున్న తిరుపతి అభిమాని ఈశ్వర రాయల్!

మెగా బ్రదర్స్ పై అభిమానాన్ని చాటుకున్న తిరుపతి అభిమాని ఈశ్వర రాయల్!

​విజయవాడ, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తిరుపతికి చెందిన మెగా అభిమాని ఈశ్వర రాయల్, తన అభిమాన హీరోలు మరియు వారి కుటుంబ సభ్యుల క్షేమం కోసం అంగప్రదర్శనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల చరణ్ కు తగిలిన చిన్న గాయం నుండి త్వరగా కోలుకోవాలని, అమ్మవారి ఆశీస్సులతో ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’ ప్రకటించాలని తన ఆకాంక్షను వెలిబుచ్చారు. అంతేకాకుండా, భవిష్యత్తులో చిరంజీవికి భారత రాష్ట్రపతి కావాలన్నది తన కోరిక అని పేర్కొన్నారు. తన అభిమానాన్ని చాటుకుంటూ, చిరంజీవి కి భారత రత్న రావాలని కోరుతూ తిరుపతి నుండి అయోధ్య వరకు త్వరలోనే సైకిల్ యాత్ర చేపట్టనున్నట్లు ఈశ్వర రాయల్ ప్రకటించారు.ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కూడా అమ్మవారి కృపాకటాక్షాలు మెండుగా ఉండాలని, ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా ఆయన ప్రార్థించారు.చివరగా తన వివరాలను వెల్లడిస్తూ.. తాను తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గంలోని బలిజపల్లి గ్రామానికి చెందినవాడినని తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్