బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఆ టెండర్ను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం

ఆ టెండర్ను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం
  • యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భవాని శంకర్ కు వినతి పత్రం అందజేత
  • బిఆర్ఎస్ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి

యాదగిరిగుట్ట : మార్చి 27 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శుక్రవారం రోజు యాదగిరిగుట్ట దేవస్థానంలో ఇటీవల నిర్వహించిన ఓ టెండర్ దేవస్థానానికి తీవ్ర నష్టం జరిగేలా ఉందని తక్షణమే ఈ టెండర్ను రద్దు చేయాలని కోరుతూ బిఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణ సెక్రెటరీ జనరల్ పాపట్ల నరహరి ఆధ్వర్యంలో శుక్రవారం యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భవాని శంకర్ కు వినతి పత్రం అందజేశారు. కొండ కింద లక్ష్మీ పుష్కరిణి వద్ద 9, 10 నెంబర్లు గల దుకాణాలలో కూల్డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ బనియన్స్ టవల్స్ విక్రయించేందుకు ఇటీవల నిర్వహించిన టెండర్ను టెండర్దారులు సిండికేట్ గా మారి తక్కువ మొత్తంలో దక్కించుకున్నారని పాపట్ల నరహరి ఆరోపించారు. గతంలో కంటే 75% తగ్గించి తక్కువ మొత్తానికి అద్దెకు ఇవ్వడం వల్ల దేవస్థానం నష్టపోతుందని అన్నారు. దీనివల్ల గతంలో కంటే దేవస్థానానికి తక్కువ ఆదాయం వచ్చి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. దీనిపై విచారణ జరిపి ఆ టెండర్ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని అన్నారు. ఈ మేరకు దేవస్థానం ఈవో భవాని శంకర్కు వినతి పత్రం సమర్పించగా ఆయన దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు దేవపూజ అశోక్, మోతే నరసింహ , మిట్ట వెంకటేష్, మోతే బాలు , సర్దార్ , మోతే విజయ్ , కంసాని స్వామి, మోతే శంకర్, రేఖల రాజు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి