Breaking News

మీడియా సమస్యలపై చర్చిస్తున్న నేతలు…!

విజయవాడ, మార్చి 27 సెంట్రల్ నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: దేశంలో అత్యధిక సంఖ్యాక వర్కింగ్ జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ 11 వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం అమరావతిలో ప్రారంభమయ్యాయి. 27వ తేదీన తొలి రోజు ఐజేయూ జాతీయ కార్యవర్గం సమావేశమైంది. ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్లీనరీలో చర్చించనున్న వివిధ అంశాలను, ప్రవేశ పెట్టనున్న తీర్మానాలను ఖరారు చేశారు. అలాగే ప్లీనరీ సమావేశాలలో సమర్పించనున్న సెక్రటరీ జనరల్ నివేదికను కూడా కార్యవర్గ సమావేశం ఆమోదించింది. సెక్రెటరీ జనరల్ బల్విందర్ సింగ్ నివేదికలోని అంశాలను వివరించారు. సంస్థాగతం గా ఐజేయు నిబంధనావ ళికి చేయనున్న సవరణ లను కూడా కార్యవర్గ సమావేశం చర్చించి ఖరారు చేసింది. ఈ సవరణలపై ప్లీనరీలో చర్చించి ఆమోదిస్తారు. ఐజేయూ జాతీయ కార్యవర్గ ఎన్నికలను 29వ తేదీన నిర్వహిస్తా రు. యూనియన్ సీనియ ర్ నాయకుడు ఎమ్ఏ మాజిద్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కార్యవర్గ సమావేశం నియమించింది. మూడు రోజుల పాటు జరగనున్న సమావేశాలకు జరిగిన ఏర్పాట్లను, కార్యక్రమాల వివరాలను ఐజేయూ జాతీయ కార్యదర్శి వివరించారు. ఎ.పి.యు. డబ్ల్యు.జే. రాష్ట్ర అధ్యక్షు డు ఐ.వి. సుబ్బారావు తొలుత స్వాగతం పలికా రు. సి. ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ ఆలపా టి సురేష్ కుమార్, ఐజేయూ సీనియర్ నాయకులుఎస్.ఎన్.సిన్హా, దేవులపల్లి అమర్, అమర్ మోహన్ ప్రసాద్, వై.నరేందర్ రెడ్డి తదితరు లు మాట్లాడారు.జాతీయ కార్యవర్గ సమావేశానికి తొలిరోజు దాదాపు 15 రాష్ట్రాలకు చెందిన నేత లు పాల్గొన్నారు.
ప్లీనరీకి భారీగా ఏర్పాట్లు!
మార్చి 28,29 తేదీల్లో విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం లో రెండు రోజులపాటు ప్లీనరీ జరుగుతుంది. ఈ సమావేశాలకు 25 రాష్ట్రా ల నుండి దాదాపు 300 మంది ఎన్నికైన ప్రతినిధు లు హాజరవుతున్నారు.28 వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్లీనరీ సమావే శాలను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించి ప్రసంగిస్తారు. రాష్ట్ర సమాచార పౌర సంబం ధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గౌరవ అతిథి గా పాల్గొంటారు. పలువు రు మంత్రులు, ఎమ్మెల్యే లు, ఇతర ప్రజాప్రతినిధు లు అతిధులుగా హాజర వుతారు. వర్కింగ్ జర్నలి స్టుల జాతీయస్థాయి వృత్తి కార్మిక సంఘంగా ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ 1989 లో ఏర్పడింది. గత 36 సంవత్సరాలుగా దేశంలో భావప్రకటనా స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను పరిర క్షించడానికి ఐజేయూ విశేష కృషి చేస్తూ వచ్చిం ది. ప్రభుత్వాల నుండి, సంఘ వ్యతిరేక శక్తుల నుండి మీడియాకు, జర్నలిస్టులకు ఎదురవు తున్న సవాళ్లను ప్రమాదా లను ఎదుర్కోవడంలో ఐజేయూ కీలక భూమిక పోషిస్తూ వచ్చింది.వర్కింగు జర్నలిస్టుల పని పరిస్థితులు, వేతనాలు మెరుగుపరచడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మనీసానా సింగ్ వేజ్ బోర్డును,జి.ఆర్.మాజీథియా వేజ్ బోర్డును ఏర్పాటు చేయించడంలో ఐజేయూ విజయం సాధించింది. వర్కింగు జర్నలిస్టుల ఉద్యోగ భద్రత వేతన భద్రత కోసం వివిధ వేజ్ బోర్డుల ముందు బలమైన వాద నలు వినిపించి వేతనాల పెంపుదల సాధించడంలో ఐజేయు ఎనలేని కృషి చేసింది. వేజ్ బోర్డుల సిఫార్సులను అమలు చేయించేందుకు కూడా పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పోరాడింది.
గ్రామీణ పాత్రికేయులను కూడా వేతన వ్యవస్థలో భాగం చేయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ లను తీసు కురావడంలో ఐజేయూ ఫలప్రదం అయ్యింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాత కార్మిక చట్టాలను మార్చి కార్మిక కోడ్ లను అమలులోకి తేవడంతో వర్కింగు జర్నలిస్టు చట్టం కూడా రద్దయ్యింది. రద్ద యిన వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని పునరుద్ధరించా లని కోరుతూ ఇటీవల ఐజేయూ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టింది.మీడియాలో పొడసూపు తున్న పెడ ధోరణులకు వ్యతిరేకంగా ఐజేయూ గొంతు విప్పింది. దేశంలో ఎన్నికల ప్రక్రియను అప హాస్యం పాలు చేస్తున్న పెయిడ్ న్యూస్ కు వ్యతి రేకంగా పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా పోరాటాన్ని నిర్వహించిన ఘనత ఒక్క ఐజేయూ కే దక్కు తుంది. దేశంలో మీడియా పెట్టుబడుల కేంద్రీకరణ, గుత్తాధిపత్యం పెరగడం తో మీడియా స్థితిగతుల లో వచ్చిన మార్పులు, కృత్రిమ మేధ ప్రభావం, సామాజిక మాధ్యమాల ధోరణుల కారణంగా మీడియా రంగం ఎదు ర్కుంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, మీడియా స్థితిగతుల అధ్యయనానికి మీడియా కమిషన్ ను నియమిం చాలని ఐజేయూ కోరుతోంది. దేశంలో మీడి యా పాలసీలరూపకల్పన కోసం జరిగే బహిరంగ చర్చలో తొలి నుండీ ఐజేయు కీలక పాత్ర పోషి స్తున్నది. దేశంలో 27 రాష్ట్రాలలో ఐజేయుకు అనుబంధ సంఘాలు క్రియాశీలంగా పని చేస్తుం డగా ఐజేయూలో దాదా పు ముప్పై వేల మంది జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారు. మూడు రోజుల సమావేశాల్లో ఐజేయూ జాతీయ అధ్యక్షుడు , తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివా స రెడ్డి, సి.రాఘవాచారి మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్ ఆల పాటి సురేష్ కుమార్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా పూర్వ సభ్యులు ఐజేయూ సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ, యూనియన్ సీనియర్ నేతలు , ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పూర్వ సభ్యులు ఎస్.ఎన్.సిన్హా, దేవుల పల్లి అమర్, ఎం. ఎ.మాజిద్, ఇటీవల జరిగిన జాతీయ ఎన్నిక ల్లో ఐజేయూ సెక్రటరీ జనరల్ గా ఎన్నికయిన ఆంద్రప్రదేశ్ కు చెందిన సీనియర్ పాత్రికేయుడు డి.సోమసుందర్, ఐ జే యూ కార్యదర్శి వై. నరేం దర్ రెడ్డి, ప్లీనరీ సమావేశా లకు ఆతిథ్యం ఇస్తున్న ఎ.పి.యు.డబ్ల్యు.జే. అధ్యక్షుడు.ఐ.వి.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కే.జయరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా రవి తదితరులు పాల్గొంటు న్నారు. లోక్ సభ సభ్యు డు కేశినేని శివనాథ్ (చిన్ని) చీఫ్ పాట్రన్ గా, మీడియా అకాడమీ చైర్మన్ ఆలపా టి సురేష్ కుమార్ అధ్యక్షులుగా, ఐ.వి.సుబ్బారావు ప్రధాన కార్యదర్శిగా ఏర్పడిన ఆహ్వానసంఘం ప్లీనరీని విజయవంతం చేయడా నికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్ర దేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో జరు గుతున్న ఏర్పాట్లకు విజయవాడ ప్రెస్ క్లబ్, ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడి యా జర్నలిస్ట్స్ అసోసి యేషన్, సామ్నా, ఆంద్ర ప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ సంఘాలు తోడ్పాటు ఇస్తున్నాయి. ప్లీనరీ సందర్భంగా విజయవాడ లోని ఎ.పి.యు.డబ్ల్యు.జే. ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని మరమ్మత్తులు చేపట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు….

విశాఖ–దిల్లీ ఇండిగో విమానంలో ఇంజిన్ ఫెయిల్యూర్

ఇంధన సుంకం తగ్గింపుపై పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *