బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

తెలుగుజాతి గౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ: నారా లోకేష్

తెలుగుజాతి గౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ: నారా లోకేష్

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి లోకేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1982లో ఎన్. టి. రామారావు స్థాపించిన టీడీపీ తెలుగు ప్రజల గర్వానికి ప్రతీకగా నిలిచిందన్నారు. కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని పేర్కొన్న లోకేష్, వారి త్యాగాల వల్లే టీడీపీ బలంగా నిలిచిందన్నారు. సంక్షేమ పథకాలకు నాంది పలికింది ఎన్టీఆర్ అయితే, అభివృద్ధికి నాంది పలికింది చంద్రబాబు నాయుడేనని కొనియాడారు.అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించిన ఆయన, టీడీపీని అంతం చేస్తామని చెప్పినవారే ఇప్పుడు కనుమరుగయ్యారని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ‘క్రెడిట్ చోరీ డిజార్డర్’ ఉందని ఎద్దేవా చేశారు.పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, వారికి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. అలాగే కష్టపడిన కార్యకర్తలను గుర్తించి ఉన్నత స్థానాలకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్