Breaking News

బిహార్‌లో విషాదం.. ఆలయ రద్దీ విషాదం.. 8 మంది మృతి

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: బిహార్‌లోని నలంద జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. శీతలా మాత ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.మృతులంతా మహిళలేనని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మరో 12 మంది గాయపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.పూజల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి రావడంతో పరిస్థితి అదుపులో లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *