బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

సనాతన ధర్మమే నిజమైన జీవన మార్గం

సనాతన ధర్మమే నిజమైన జీవన మార్గం

సనాతన ధర్మమే నిజమైన జీవన మార్గం: ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు

అయోధ్యలో అపోలో ఉచిత ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభం

తిరుమల, శ్రీశైలం, కేదార్ నాథ్, బద్రీనాథ్‌లలోనూ సేవా కేంద్రాలు ఏర్పాటు

గౌరవంతో వైద్యం అందించడం సనాతన ధర్మమన్న ఉపాసన

తాతయ్య మాటలే స్పూర్తి అని వెల్లడించిన ఉపాసన

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్ ఉపాసన, సనాతన ధర్మంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోగుల పట్ల గౌరవంతో వ్యవహరిస్తూ వారికి వైద్యం అందించడం నిజమైన సనాతన ధర్మమని, ఈ సిద్ధాంతం తమకు వారి తాతయ్య నుండి అందిందని ఆమె తెలిపారు.

“రోగుల పట్ల సానుభూతితో వ్యవహరించాలి. గౌరవంగా వైద్యం అందించాలి అని మా తాతయ్య మాకు నేర్పించారు. ఆయన మాటలే మాకు మార్గదర్శకాలు. ఈ స్ఫూర్తితో తిరుమల, శ్రీశైలం, కేదార్ నాథ్, బద్రీనాథ్‌లలో ఉచిత ఎమర్జెన్సీ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశాం. తాజాగా అయోధ్య రామ మందిరం వద్ద కూడా అపోలో ఉచిత ఎమర్జెన్సీ కేర్ సెంటర్‌ను ప్రారంభించాం. ఈ కేంద్రం ద్వారా అత్యవసర వైద్య సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం” అని ఉపాసన తెలిపారు.

ఆ సేవా కార్యక్రమంలో తమకు మద్దతుగా నిలిచిన వారికి ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు. “సామాజిక బాధ్యతగా, ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఆరోగ్య సేవలను అందించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాం. ఇది సనాతన ధర్మానికి మేము ఇచ్చే మద్దతు” అంటూ ఉపాసన తన భావాలను పంచుకున్నారు.

ఈ ఉచిత సేవా కార్యక్రమం అపోలో ఫౌండేషన్ సేవా పట్ల వారి కట్టుబాటు, సమాజానికి వారు అందిస్తున్న అమూల్యమైన సహకారాన్ని తెలియజేస్తుంది.