బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

హైదరాబాద్‌లో ఆహార కల్తీ దందా భయంకరం

హైదరాబాద్‌లో ఆహార కల్తీ దందా భయంకరం

హైదరాబాద్, మార్చి 31, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ఆహార భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల వెలుగులోకి వస్తున్న గణాంకాలు చూస్తే, నగరంలో కల్తీ ఆహార దందా విస్తృతంగా జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. కేవలం ఒక నెల వ్యవధిలోనే 61 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.ప్రజలు రోజూ వినియోగించే పాలు, పెరుగు, టీ పొడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌తో పాటు ఐస్‌క్రీమ్స్ వంటి పదార్థాల్లో కూడా నాసిరకం, ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. లాభాల కోసం కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టి ప్రత్యేక దళాన్ని రంగంలోకి దింపింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పనిచేస్తున్న H-FAST బృందం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో భాగంగా ఇప్పటికే 15 టన్నులకుపైగా కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని, 64 మందిని అరెస్ట్ చేశారు.

ఇటీవల కాటేదాన్‌లో భారీగా కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకోగా, మెహిదీపట్నంలో కెమికల్స్‌తో తయారు చేసిన ఐస్‌క్రీమ్స్‌ను కూడా పట్టుకున్నారు. ఈ దందాలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ కఠిన చర్యలు తీసుకుంటామని వి. సి. సజ్జనార్ హెచ్చరించారు. అనుమానాస్పద ఆహార పదార్థాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను సూచించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి