బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణ గ్రామాలకు కేంద్రం భారీ ఊరట

తెలంగాణ గ్రామాలకు కేంద్రం భారీ ఊరట

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ రాజ్ సంస్థలకు ప్రత్యేక గ్రాంట్లను విడుదల చేస్తూ గ్రామాల అభివృద్ధికి ఊతమిచ్చింది.15వ ఆర్థిక సంఘం సూచనల మేరకు పలు రాష్ట్రాలకు కలిపి విడుదల చేసిన నిధుల్లో భాగంగా తెలంగాణకు రూ.247.94 కోట్ల అన్‌టైడ్ గ్రాంట్లు కేటాయించారు. ఈ నిధులు రాష్ట్రంలోని వేలాది గ్రామ పంచాయతీలకు నేరుగా చేరనున్నాయి.గ్రామాల్లో రోడ్లు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించనున్నారు. అయితే ఈ గ్రాంట్లను ఉద్యోగుల జీతాలు లేదా ఇతర పరిపాలనా ఖర్చులకు వినియోగించరాదని కేంద్రం స్పష్టంగా పేర్కొంది.గ్రామ సభ ఆమోదంతో మాత్రమే పనులు చేపట్టాలని, ఖర్చులన్నీ పారదర్శకంగా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రూపాయి వినియోగంపై ఆడిట్ తప్పనిసరి చేయడంతో నిధుల దుర్వినియోగానికి చెక్ పడనుంది. పంచాయతీ ఎన్నికలు పూర్తవడంతో కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు మరింత వేగంగా అమలవుతాయని అధికారులు భావిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి