బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణలో మళ్లీ వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణ

తెలంగాణలో మళ్లీ వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణ

|| Restoration of the VIRO system again in Telangana ||

హైదరాబాద్:
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలోనే ప్రకటించి సంక్రాంతి నాటికి వ్యవస్థను తిరిగి తీసుకువస్తామని వెల్లడించారు.

ప్రస్తుతానికి రాష్ట్రంలో సుమారు 3,000 వీఆర్వోలు ఉండగా, కొత్తగా 8,000 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వీఆర్వోలను నేరుగా బాధ్యతలు అప్పగిస్తారు. మిగతా ఖాళీలను ప్రత్యేక రాత పరీక్షల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

10,909 రెవెన్యూ గ్రామాలకు నియామకాలు
రాష్ట్రంలోని 10,909 రెవెన్యూ గ్రామాలకు వీఆర్వోలను నియమించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నియామకాల ద్వారా రెవెన్యూ వ్యవస్థకు సరైన నియంత్రణ, పారదర్శకత తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

గతంలో రద్దు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రెవెన్యూ శాఖలో అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారు. అయితే, పునరుద్ధరణతో గ్రామస్థాయిలో రెవెన్యూ పనులను సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటి నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు, రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.