ఏఎస్ఐ పేరుతో ఘరానా మోసం
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోసపాలయ్యారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఫోన్ ద్వారా జరిగిన ఈ సంఘటనలో మోసగాడు తాను ఏఎస్ఐగా పనిచేస్తున్నానని చెప్పి, అత్యవసరంగా రూ. 60,000 కావాలంటూ ఫోన్ పే ద్వారా పంపించాలని కోరాడు.
ఎలా జరిగింది?
మోసగాడు తనను పోలీసు అధికారిగా నమ్మబలికి, డబ్బులు పంపితే క్యాష్ రూపంలో తిరిగి చెల్లిస్తానని మాటిచ్చాడు. ఆ నమ్మకంతో సదరు ఉపాధ్యాయుడు ఫోన్ పే ద్వారా రూ. 60,000 పంపించారు. అయితే, డబ్బులు పంపిన వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. ఇది అనుమానాస్పదంగా అనిపించి ఆ ఉపాధ్యాయుడు గూడూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వివరాలు తెలియజేశారు.
పోలీసుల స్పష్టత
పోలీసులు విచారణలో భాగంగా సదరు నంబర్ గల వ్యక్తిని తమ స్టేషన్‌లో ఎఎస్ఐగా పనిచేసే వారు కాదని స్పష్టం చేశారు. దీంతో ఇది మోసమేనని నిర్ధారణ అయ్యింది. బాధిత ఉపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు నమోదు చేయగా, పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.