బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

స్టార్‌డమ్ కోసం కాదు.. పాత్రల కోసం నటించా: రాజశేఖర్

స్టార్‌డమ్ కోసం కాదు.. పాత్రల కోసం నటించా: రాజశేఖర్

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, స్టార్‌డమ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో విడుదల కానున్న ‘బైకర్’ చిత్రం సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.తాను ఎప్పుడూ స్టార్‌డమ్ కోసం సినిమాలు చేయలేదని, మంచి కథలు, పాత్రల కోసమే సినిమాలు ఎంచుకున్నానని తెలిపారు. “సబ్జెక్టే హీరో” అనే సిద్ధాంతాన్ని ఎప్పుడూ పాటించానని చెప్పారు. ఇదే కారణంగా తనకు స్టార్‌డమ్ రాలేదని ఆయన స్పష్టం చేశారు.తన కెరీర్‌లో మగాడు, అల్లరి ప్రియుడు, గరుడ వేగ వంటి చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయని గుర్తుచేశారు.ఇక ‘బైకర్’ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందించారని, యూవీ క్రియేషన్స్ పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో శర్వానంద్ తో కలిసి కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు.తన కుటుంబ సభ్యులు జీవిత రాజశేఖర్, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ కూడా సినీ రంగంలో రాణిస్తున్నారని, వారి విజయంపై గర్వంగా ఉందని అన్నారు.ఏప్రిల్ 3న విడుదల కానున్న ‘బైకర్’ చిత్రం తనకు మళ్లీ మంచి గుర్తింపు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?