Breaking News

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మంత్రి తుమ్మల

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర ప్రభుత్వం పారాక్వాట్ గడ్డిమందు వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ గడ్డిమందు అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై 60 రోజుల పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.రైతుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఈ అంశంపై కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, నిషేధాన్ని కచ్చితంగా అమలు చేస్తామని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పరిస్థితులను సమీక్షిస్తూ, అవసరమైన తదుపరి చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

ఇందిరమ్మ ఇళ్ల కోసం హైదరాబాద్‌లో ఖాళీ స్థలాల పరిశీలన

బాల్క సుమన్ వ్యాఖ్యలపై పొన్నం ఫైర్.. కేసు నమోదు చేయాలని డిమాండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *