బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

దేశవ్యాప్తంగా అమరావతికి మద్దతు.. ప్రజల ఆకాంక్ష నెరవేరుతోంది – లోకేష్

దేశవ్యాప్తంగా అమరావతికి మద్దతు.. ప్రజల ఆకాంక్ష నెరవేరుతోంది – లోకేష్

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: అమరావతి చట్టబద్ధత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. లోక్‌సభలో జరిగిన చర్చను తాను టీవీలో పూర్తిగా వీక్షించానని, ఆ చర్చ ఉత్కంఠ రేపిందని పేర్కొన్నారు.సభలో సభ్యులు అమరావతి చరిత్ర, సంస్కృతి, అవసరాన్ని వివరిస్తున్నప్పుడు ఒక ఆంధ్రుడిగా గర్వంగా అనిపించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహా దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని అన్నారు.లోక్‌సభ వేదికగా అమరావతి గొప్పతనం దేశమంతటికీ మరోసారి పరిచయమైందని లోకేష్ వ్యాఖ్యానించారు. అయితే ఈ కీలక చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని, అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుందని స్పష్టం చేశారు. “నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం.. నా రాజధాని అమరావతి అజరామరం” అని ఆయన పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్