బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఆరోగ్యశ్రీపై షర్మిలా ఫైర్ – కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు

ఆరోగ్యశ్రీపై షర్మిలా ఫైర్ – కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు

విజయవాడ, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: విజయవాడలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆరోగ్యశ్రీ పథకానికి సరైన నిధులు కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.ప్రజల ఆరోగ్యానికి రూపాయి కూడా ఇవ్వకుండా, ఇతర కార్యక్రమాలకు భారీగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వాటిని విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని అన్నారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కోట్లాది పేదలకు ప్రాణాధారమని, అలాంటి పథకాన్ని ప్రస్తుతం నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. నెలల తరబడి వైద్యసేవలు నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.అలాగే ఆరోగ్యశ్రీని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపి సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహించడం మానుకుని తక్షణం బకాయిలు విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలా హెచ్చరించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్