బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

హోదా, హామీలపై కాంగ్రెస్ ఫైర్.. ఎంపీలపై షర్మిల తీవ్ర విమర్శలు

హోదా, హామీలపై కాంగ్రెస్ ఫైర్.. ఎంపీలపై షర్మిల తీవ్ర విమర్శలు

విజయవాడ, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలపై కాంగ్రెస్ పార్టీ గళం వినిపించిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఈ విషయాలను ప్రస్తావించిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌కు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.విభజన హామీల అమలుపై కాంగ్రెస్ నాయకత్వం చూపుతున్న చిత్తశుద్ధి, రాష్ట్ర ఎంపీల్లో కనిపించకపోవడం దురదృష్టకరమని షర్మిల విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ కూడా బలంగా మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే కేంద్రానికి మెప్పు పొందడమే ముఖ్యమైందని ఆరోపిస్తూ, అన్ని పార్టీల ఎంపీలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల హక్కుల కోసం పోరాడాల్సిన ఎంపీలు మౌనంగా ఉండటం రాష్ట్రానికి నష్టం కలిగిస్తోందన్నారు. విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలని షర్మిల కోరారు. లేదంటే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్