బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

సిఎం చంద్రబాబు కృషి వల్లే ఇదంతా సాధ్యమైంది.

అమరావతి రైతుల తరఫున సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

విశాఖపట్నం, ఏప్రిల్ 1(నేటి తెలుగు పత్రిక): అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి హోంమంత్రి అనిత ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. అమరావతి రైతుల తరఫున సీఎం చంద్రబాబుకు హోంమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. అమ‌రావ‌తిపై పోరాడి విజ‌యం సాధించిన రైతుల‌కు అభినంద‌న‌లు తెలిపారు. అమ‌రావ‌తికి అండ‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇది రైతుల త్యాగాలకు, శాంతియుత పోరాటానికి ద‌క్కిన ఫ‌లితమన్నారు. అమరావతిని అంగుళం కూడా వేరొకరు కదిపే పరిస్థితి లేకుండా కట్టుదిట్టంగా చట్టాలు, శాసనాలతో ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం సొంతమన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని పునఃప్రతిష్ఠించిన కేంద్ర ప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన అన్ని పక్షాలకు హోంమంత్రి అనిత ధన్యవాదాలు తెలిపారు.