మంగళగిరి ఏప్రిల్ 01 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఐదుకోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మకమైన రోజుకు దేశ పార్లమెంటు వేదిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానానికి చట్టబద్ధత కల్పించే అమరావతి బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదించడం కోట్లాది ప్రజలు గర్వించదగ్గ సందర్భం. కేంద్రప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన పార్టీలకు కృతజ్ఞతలుఇది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమరావతి విజయంఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం.ఇది రైతుల త్యాగాలకు దక్కిన దైవ ఆశీస్సులు.. శాంతియుత పోరాటానికి దక్కిన ఫలితం.కోట్లాది ప్రజల కోరికను గౌరవించిన కేంద్రం ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా
చరిత్ర-సంస్కృతికి ఆలవాలమైన అమరావతిని నిలిపిందిజై ఆంధ్రప్రదేశ్..జయహో అమరావతి..విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
