బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
బిజినెస్

ప్రీమియం ఇంధన ధరలు పెంపు.. ఇండియన్ ఆయిల్ నిర్ణయం

ప్రీమియం ఇంధన ధరలు పెంపు.. ఇండియన్ ఆయిల్ నిర్ణయం

ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా వాహనదారులకు మరో షాక్ తగిలింది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.హైఎండ్ వాహనాల్లో వినియోగించే ఎక్స్‌పీ100 పెట్రోల్ ధరను లీటరుకు సుమారు రూ.11 పెంచగా, ఇప్పుడు అది రూ.160కు చేరింది. అలాగే ‘ఎక్స్‌ట్రా గ్రీన్’ ప్రీమియం డీజిల్ ధరను రూ.91.49 నుంచి రూ.92.99కు పెంచారు.అయితే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించినప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇక కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర కూడా భారీగా పెరిగింది. ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ ధర రూ.2,078.50కి చేరింది. అదేవిధంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో విమాన టికెట్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు