బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

గ్లోబల్ క్రైసిస్ నేపథ్యంలో కేంద్రం కీలక చర్య.. దిగుమతి సుంకాల ఎత్తివేత

గ్లోబల్ క్రైసిస్ నేపథ్యంలో కేంద్రం కీలక చర్య.. దిగుమతి సుంకాల ఎత్తివేత

న్యూఢిల్లీ, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. పలు కీలక రసాయనాలు, ఎరువుల ముడి పదార్థాలపై దిగుమతి సుంకాలను తాత్కాలికంగా రద్దు చేసింది.అమ్మోనియం నైట్రేట్‌తో పాటు మెథనాల్, ఫినాల్, పీవీసీ, పాలీప్రొపిలీన్ వంటి దాదాపు 40 రకాల పెట్రోకెమికల్ ఉత్పత్తులపై సుంకాలను సున్నాకు తగ్గించారు. ఈ మినహాయింపు ఏప్రిల్ 2 నుంచి జూన్ 30 వరకు అమల్లో ఉంటుంది.పెరిగిన ముడి పదార్థాల ధరలు, సరఫరా కొరత కారణంగా పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఎరువుల రంగానికి ఇది పెద్ద ఊరటనివ్వనుందని భావిస్తున్నారు.ఈ చర్యతో పరిశ్రమలకు తక్కువ ధరల్లో ముడి పదార్థాలు అందుబాటులోకి రావడంతో పాటు, ఉత్పత్తి ఖర్చులు తగ్గి ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చే అవకాశముంది. అలాగే ప్యాకేజింగ్, ఆటోమోటివ్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాలపై కూడా సానుకూల ప్రభావం పడనుంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ