బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ప్రేమ వివాహం కారణంగా కూతురిని హత్య చేసిన తండ్రి.. ఆత్మహత్యగా నాటకం

ప్రేమ వివాహం కారణంగా కూతురిని హత్య చేసిన తండ్రి.. ఆత్మహత్యగా నాటకం

పల్నాడు, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో కన్న తండ్రే కూతురిని హత్య చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మాచర్లలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.యాదవబజార్‌కు చెందిన యువతి చౌడేశ్వరి, తనకు ఇష్టమైన యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లిని అంగీకరించని తండ్రి చంద్రశ్రీను, కూతురిని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.మొదట ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులకు తెలిపినప్పటికీ, పోస్టుమార్టం నివేదికలో గొంతునులిపి హత్య చేసిన తర్వాత ఉరివేసినట్లు తేలింది. దీంతో కేసు మలుపు తిరిగింది.సాంకేతిక ఆధారాలతో నిజాన్ని బయటపెట్టిన పోలీసులు చంద్రశ్రీనును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రేమ వివాహాన్ని అంగీకరించలేక కూతురినే బలి తీసుకున్న తండ్రి చర్యపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్