బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
స్పోర్ట్స్

కమిన్స్‌ను కాపాడుకునేందుకు సీఏ భారీ ప్లాన్.. రూ.113 కోట్ల ఆఫర్!

కమిన్స్‌ను కాపాడుకునేందుకు సీఏ భారీ ప్లాన్.. రూ.113 కోట్ల ఆఫర్!

మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆస్ట్రేలియా స్టార్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ను దేశ జట్టుతోనే కొనసాగించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా భారీ కాంట్రాక్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం. మూడు సంవత్సరాల కాలానికి 12 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.113 కోట్ల ఒప్పందాన్ని కమిన్స్‌కు ఆఫర్ చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.టీ20 లీగ్‌ల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు ఫ్రాంచైజీ క్రికెట్ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితిలో.. కమిన్స్‌ను టెస్ట్ క్రికెట్‌కు అందుబాటులో ఉంచడమే సీఏ ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. ఈ ఒప్పందంతో కమిన్స్ ఏడాదికి సుమారు 4 మిలియన్ డాలర్లు అందుకోనున్నాడు.ఐపీఎల్ సహా పలు లీగ్‌ల నుంచి కమిన్స్‌కు భారీ ఆఫర్లు వచ్చినట్లు ప్రచారం జరుగుతున్న వేళ.. క్రికెట్ ఆస్ట్రేలియా ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ల సంఖ్యతో సంబంధం లేకుండా స్థిర పారితోషికం ఇవ్వనున్నారని సమాచారం.కమిన్స్ నాయకత్వంలో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, వన్డే వరల్డ్‌కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. టెస్ట్ క్రికెట్ భవిష్యత్తును కాపాడే దిశగా సీఏ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్