బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

‘భోగి’లో డింపుల్ హయతి పవర్‌ఫుల్ లుక్ వైరల్

‘భోగి’లో డింపుల్ హయతి పవర్‌ఫుల్ లుక్ వైరల్

మే 12, (నేటి తెలుగు పత్రిక): శర్వానంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ నుంచి హీరోయిన్ డింపుల్ హయతి ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో డింపుల్ హయతి ‘మందారం’ అనే కీలక పాత్రలో నటిస్తోంది. “ప్రపంచం కోరుకున్న అందం.. కానీ ఆ ఆత్మను ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు” అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.ఎర్ర చీరలో చేతిలో విసనకర్ర పట్టుకుని డింపుల్ హయతి కనిపించిన తీరు పవర్‌ఫుల్‌గా ఉందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. 1960ల గ్రామీణ నేపథ్యంలో ఆమె పాత్రను దర్శకుడు ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకు గ్లామర్ పాత్రల్లో కనిపించిన డింపుల్, ఈ సినిమాలో మాత్రం బలమైన భావోద్వేగాలతో కూడిన పాత్రలో కనిపించనుందని సమాచారం. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేక మేకోవర్ అయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘భోగి’పై ఇప్పటికే మంచి అంచనాలు ఉండగా, డింపుల్ హయతి ఫస్ట్ లుక్‌తో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?