తెలంగాణలో సమగ్ర కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుల గణన (Caste Census)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని అన్నారు.
సర్వేపై సీఎం సమీక్ష
ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కుల గణనపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
🔹 రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేపై జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తున్నాయని సీఎం తెలిపారు.
🔹 సర్వే విజయవంతంగా పూర్తయినందుకు సంబంధిత అధికారులను అభినందించారు.
🔹 సర్వే ముసాయిదా ఇప్పటికే సిద్ధమైందని, త్వరలో పూర్తి నివేదికను అందజేస్తామని అధికారులు వివరించారు.
🔹 ఫిబ్రవరి 2వ తేదీలోగా నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి సమర్పిస్తామని సీఎంకు అధికారులు తెలియజేశారు.
