బీజేపీ జిల్లాల అధ్యక్షుల ఎంపికకు ముహూర్తం ఫిక్స్..
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ జిల్లాల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు ముగించిన స్టేట్ బీజేపీ నాయకత్వం ఇప్పుడు జిల్లా కమిటీల అధ్యక్షుల ఎంపికపై దృష్టి సారించింది. జిల్లా అధ్యక్షుల ఎంపికపై ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నాలు చేస్తూ, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.
నామినేషన్ల స్వీకరణ, ప్రకటన
ఈ క్రమంలో స్టేట్ బీజేపీ ఇన్చార్జి సునీల్ బన్సల్, ఎన్నికల పరిశీలకులు అరవింద మీనన్, రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కేంద్ర నాయకత్వంతో చర్చించి జిల్లా అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ పూర్తిగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
శనివారం నామినేషన్ల స్వీకరణ, ఆదివారం జిల్లాల అధ్యక్షుల ఎంపికపై ప్రకటన చేయాలని నిర్ణయించారు.
