Breaking News

Big shock for Congress in Telangana – Massive additions to BJP!

తెలంగాణలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్ – బీజేపీలో భారీగా చేరికలు!

తెలంగాణలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్ – బీజేపీలో భారీగా చేరికలు!

📍 హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress) కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎంపీ సీతారాం నాయక్ (Former MP Sitaram Naik), బీజేపీ ST మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కళ్యాణ్ నాయక్ (Dr. Kalyan Naik) నేతృత్వంలో భారీగా కాంగ్రెస్ నుంచి నేతలు, కార్యకర్తలు బీజేపీలో (Telangana BJP) చేరారు.

👉 కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం
ఢిల్లీ లోని తన నివాసంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) వారిని అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు సభావత్ శ్రీనివాస్ నాయక్, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి సభావత్ విజయ సహా వారి అనుచరులు కూడా బీజేపీలో చేరారు.

🔹 “మోదీ పాలనలో అభివృద్ధి, సంక్షేమం”
ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ, “కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు అభివృద్ధి, సంక్షేమంలో ముందుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలు విసుగొచ్చి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు” అని అన్నారు.

గవర్నర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు.. పొంగులేటిపై మైనింగ్ ఆరోపణల ఫిర్యాదు

“ఇచ్చిన గ్యారంటీలలో ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీని సరిగ్గా అమలు చేయడం లేదు. ఇటీవల నిర్వహించిన కులగణన కూడా పూర్తిగా తప్పులతో నిండింది. బీసీ వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది” అని డీకే అరుణ మండిపడ్డారు.

🔹 “బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోంది”
కాంగ్రెస్ నేతల తీరుతో రాష్ట్ర ప్రజలు విసిగి పోయారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ST మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్ నేనావత్, రాష్ట్ర నాయకులు రితేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. 🚩

కల్తీ ఆహారంపై యుద్ధం.. ప్రత్యేక వ్యవస్థతో కఠిన చర్యలు: సీఎం రేవంత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *